ముగించు

చరిత్ర

పెద్దాపల్లి జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లా నుండి విబజిOచబడింది. దీని చుట్టూ మంచిర్యాల , భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల  జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో 14 మండలాలు, రెండు రెవెన్యూ విభాగాలు ఉన్నాయి – పెద్దపల్లి మరియు మంథని. పెద్దపల్లి పట్టణం దాని ప్రధాన కార్యాలయం.

ఈ జిల్లాలో కొన్ని ప్రధాన రైల్వే లైన్లు ఉన్నాయి, వీటిలో ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలను కలుపుతుంది. హైదరాబాద్-రామగుండం రాష్ట్ర రహదారి కూడా జిల్లాను క్రాస్ చెస్తుంది,బాగా అనుసంధానించబడిన ఈ జిల్లాలో గోదావరిఖని, రామగుండం మరియు మంతాని వద్ద మూడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో భాగమైన ఎన్‌టిపిసి రామగుండం, రామగుండంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రధాన విద్యుత్ కేంద్రాలలో ఒకటి మరియు భారతదేశంలో మొదటి ISO 14001 సర్టిఫికేట్ పొందిన “సూపర్ థర్మల్ పవర్ స్టేషన్”. సింగరేని, ఎఫ్‌సిఐ మరియు అనేక ప్రైవేట్ సిమెంట్ కర్మాగారాలు వంటి ప్రధాన పరిశ్రమలకు ఈ జిల్లా నిలయం.

గోదావరి నది పెద్దపల్లి జిల్లా గుండా వెళుతుంది మరియు జిల్లా మొత్తం SRSP కమాండ్ ఏరియా పరిధిలో ఉంది. పత్తి మరియు మొక్కజొన్న తరువాత వరి ఉత్పత్తులకు జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన పత్తి దాని నాణ్యతకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా రైస్ మిల్లులు మరియు స్పిన్నింగ్ మిల్లులతో నిండి ఉంది.

జిల్లా చారిత్రక మరియు పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉంది. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నాటి బౌద్ధ స్థూపం మరియు గ్రీకు చరిత్రకారుడు మెగాస్తేనిస్ పేర్కొన్న 30 గోడల నగరాల్లో ఒకటి  ఏలిగేడు మండలంలోని ధులికట్ట గ్రామంలో ఉంది.

పెడపల్లి జిల్లాలో  ఓదెల లోని శ్రీ మల్లికార్జున స్వామి మరియు కామన్పూర్ మండలంలో శ్రీ వరహస్వామి పవిత్ర మందిరాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో రాముని గుండాలు, సబ్బితం జలపాతాలు ఉన్నాయి. బేగంపేట గ్రామంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రామగిరి ఖిలా కూడా పర్యాటకులు తరచూ సందర్శిస్తారు.

 

జిల్లాల్లోని కొన్ని పర్యాటక ప్రదేశాలు:

రాముని గుండాలు, సబ్బితం వద్ద జలపాతాలు. రామగిరి ఖిలా చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మరియు బేగుంపేట వద్ద ఉంది.